బీఎస్పీలో చేరిన నీలం మధు

కాంగ్రెస్ లో టిక్కెట్ దక్కకపోవడంతో పటాన్‌చెర్వు కు చెందిన నీలం మధు బీఎస్పీలో చేరారు.

Update: 2023-11-10 07:41 GMT

కాంగ్రెస్ లో టిక్కెట్ దక్కకపోవడంతో పటాన్‌చెర్వు కు చెందిన నీలం మధు బీఎస్పీలో చేరారు. ఆయన నామినేషన్ వేయడానికి బయలుదేరాడు. జాబితాలో నీలం పేరును ప్రకటిస్తూ కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయం తీసుకుంది. అయితే నీలం మధుకు సీటు ఇవ్వడాన్ని మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ వ్యతిరేకించారు. కాటా శ్రీనివాస్‌గౌడ్ కు టిక్కెట్ ఇవ్వకుంటే తాను పార్టీకి రాజీనామా చేస్తానని హెచ్చరించారు. దీంతో పార్టీ వ్యవహారాల ఇన్ ఛార్జి మాణిక్‌రావు ఠాక్రే ఆయనతో మాట్లాడి బుజ్జగించారు.

బీఫారం ఇవ్వకుండా....
టిక్కెట్ కేటాయించిన నీలం మధుకు బీఫారం ఇవ్వలేదు. నిన్న రాత్రి ప్రకటించిన జాబితాలో నీలం మధు స్థానంలో కాటా శ్రీనివాస్ పేరును ప్రకటించింది. దీంతో ఉదయం నుంచి ఆయన తన అనుచరులు, సన్నిహితులతో సమావేశమయ్యారు. బీజేపీ నుంచి కూడా ఆయనకు ఆహ్వానం అందింది. అయితే పోటీ చేయాలన్న ఉద్దేశ్యంతో ఉన్న నీలం మధు బీఎస్పీలో చేరారు. నామినేషన్ వేయడానికి బయలుదేరి వెళ్లడంతో ఆయన పోటీ ఖాయమయింది.


Tags:    

Similar News