మాదే విజయం.. ఎవరూ ఆపలేరు

భారతీయ జనతా పార్టీ వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా విజయం సాధిస్తుందని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ధీమా వ్యక్తం చేశారు.;

Update: 2022-02-19 12:11 GMT
dharmapuri arvind, bjp, nizamabad
  • whatsapp icon

భారతీయ జనతా పార్టీ వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా విజయం సాధిస్తుందని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ధీమా వ్యక్తం చేశారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు పెట్టినా బీజేపీ నిజామాబాద్ జిల్లాలో క్లీన్ స్వీప్ చేస్తుందని చెప్పారు. బీజేపీ ఎదుగుదలను ఎవరూ ఆపలేరని ఆయన ఛాలెంజ్ చేశారు. సిమెంట్ రోడ్ల నిర్మాణంలో 90 శాతం నిధులు కేంద్ర ప్రభుత్వానివేనని ధర్మపురి అరవింద్ చెప్పారు.

ఎందుకీ ఆంక్షలు....
ఆర్మూర్ లో తనపై టీఆర్ఎస్ నేతలు దాడి చేస్తే రైతులంటూ కప్పిపుచ్చే ప్రయత్నం చేశారన్నారు. ధర్బల్లిలో దాడి చేసింది నిరుద్యోగులా? లేక డబుల్ బెడ్ రూం ఇళ్లు ఇవ్వలేదని మహిళలు దాడి చేస్తారా? అని ధర్మపురి అరవింద్ ప్రశ్నించారు. భైంసా అల్లర్ల బాధితులను నెలల తరబడి జైల్లో ఉంచారన్నారు. హిజాబ్ కు మద్దతుగా ఎవరు ర్యాలీ చేసినా అనుమతి ఇచ్చే ప్రభుత్వం, శివాజీ, హనుమాన్ జయంతికి మాత్రం ఆంక్షలు విధిస్తుందని అరవింద్ ఫైర్ అయ్యారు.


Tags:    

Similar News