Telangana : నేటి నుంచి తెలంగాణలో ఒంటిపూట బడులు
తెలంగాణలో నేటి నుంచి ఒంటిపూట బడులు కొనసాగనున్నాయి.
తెలంగాణలో నేటి నుంచి ఒంటిపూట బడులు కొనసాగనున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా కులగణన నేటి నుంచి జరగనుండటంతో ప్రభుత్వ పాఠశాలలకు ఒంటిపూట కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కులగణన చేపట్టే ఎన్యుమరేటర్లందరూ దాదాపు ఉపాధ్యాయులే కావడంతో ఒకపూట బడి, మరొక పూట ఇంటింటి సర్వే కార్యక్రమాన్ని చేపట్టాలి. అందుకోసమే తెలంగాణ వ్యాప్తంగా నేటి నుంచి ఒకపూట మాత్రమే పాఠశాలలు నడుస్తాయని విద్యాశాఖ అధికారులు తెలిపారు.
మధ్యాహ్నం ఒంటి గంట వరకూ...
మధ్యాహ్నం ఒంటి గంట వరకూ మాత్రమే బడి ఉంటుంది. తర్వాత ఉండదు. మధ్యాహ్నం ఒంటి గంట నుంచి ఉపాధ్యాయులు తమకు కేటాయించిన ప్రాంతంలో కులగణన కార్యక్రమంలో భాగంగా ఇంటింటి సర్వే చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం ఎనభై వేల మంది వరకూ ఉపాధ్యాయులను నియమించడంతో అన్ని పాఠశాలలకు ఒంటిపూట బడులను నిర్వహించాలని నిర్ణయించారు. ఉన్నత పాఠశాలలు మాత్రం యధాతధంగా నడుస్తాయని విద్యాశాఖ ఒక ప్రకటనలో తెలిపింది. నెల రోజుల పాటు ఈ ఒంటిపూట బడులు కొనసాగనున్నాయి.