Cbi : వారం రోజులే సమయం

మరో వారం రోజులే సమయం ఉండటంతో సీబీఐ అధికారులు వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణను వేగవంతం చేశారు.

Update: 2023-04-23 06:30 GMT

మరో వారం రోజులే సమయం ఉండటంతో సీబీఐ అధికారులు వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణను వేగవంతం చేశారు. ఈ నెల 30వ తేదీలోగా విచారణ పూర్తి చేసి నివేదిక తమకు అప్పగించాలని సుప్రీంకోర్టు ఆదేశించిన నేపథ్యంలో సీబీఐ అధికారులు స్పీడ్ పెంచారు. నిన్న వివేకా అల్లుడు రాజశేఖర్‌ను కూడా సీబీఐ అధికారులు ప్రశ్నించారు. వివేకా రెండో భార్య షమీమ్ సీబీఐకి ఇచ్చిన స్టేట్‌మెంట్‌తో ఆయనను విచారించినట్లు తెలిసింది.

ఈరోజు విచారణకు...
తాజాగా ఈరోజు సీబీఐ కస్టడీకి వైఎస్ భాస్కర్ రెడ్డి, ఉదయ్‍కుమార్ లను తీసుకుని విచారిస్తున్నారు. ఐదో రోజు భాస్కర్ రెడ్డి, ఉదయ్‍ కుమార్ లను సీబీఐ అధికారులు ప్రశ్నిస్తున్నారు. చంచల్‍గూడ జైలు నుంచి కస్టడీలోకి తీసుకున్న సీబీఐ అధికారులు తమ కార్యాలయంలో విచారిస్తున్నారు. సునీల్ యాదవ్‍కు కోటి రూపాయలు ఇచ్చారన్న దస్తగిరి స్టేట్‍మెంట్‍పై సీబీఐ ఆరా తీస్తున్నట్లు తెలిసింది. వారం రోజులే గడువు ఉండటంతో ఎవరిని ఇంకా అరెస్ట్ చేస్తారన్న ఉత్కంఠ నెలకొంది.


Tags:    

Similar News