కవితకు ఆ మినహాయింపు ఎందుకో?

కల్వకుంట్ల కవితకు సీబీఐ నోటీసులపై పలు అనుమానాలున్నాయని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు;

Update: 2022-12-03 12:10 GMT

కల్వకుంట్ల కవితకు సీబీఐ నోటీసులపై పలు అనుమానాలున్నాయని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. కవితను ఆమె ఇంట్లో విచారించాల్సిన అవసరం ఏముందని ఆయన ప్రశ్నించారు. మిగిలిన వారిని ఢిల్లీలో విచారణ చేసిన సీబీఐ కవితను మాత్రమే ఆమె ఇంట్లో ఎందుకు విచారణ చేయాల్సి వస్తుందో అర్థం కాకుండా ఉందన్నారు. కవితకు ఆ మినహాయింపు ఎందుకు ఇచ్చారని ఆయన ప్రశ్నించారు.

బెంగాల్ తరహా...
బీజేపీ, టీఆర్ఎస్ మధ్య అవగాహన ఉందని రేవంత్ రెడ్డి అన్నారు. పశ్చిమ బెంగాల్ తరహాలో తెలంగాణలో టీఆర్ఎస్, బీజేపీ ఆపరేషన్ ను ప్రారంభించాయని తెలిపారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో విచారించాల్సి ఉంటే కవితను ఢిల్లీకి ఎందుకు పిలవలేదని ఆయన ప్రశ్నించారు. బీజేపీ, టీఆర్ఎస్ లు కలసి తెలంగాణలో కాంగ్రెస్ ను లేకుండా చేయాలని ప్రయత్నిస్తున్నాయని, అయితే ప్రజలు వీరి ప్లాన్ ను అర్థం చేసుకుంటారని రేవంత్ రెడ్డి అన్నారు.


Tags:    

Similar News