మోదీ పర్యటన.. నో ఫ్లై జోన్ గా ఆ ప్రాంతాలు
భారత ప్రధాని నరేంద్రమోదీ తెలంగాణ పర్యటనలో భాగంగా వరంగల్ కు జులై 8న వస్తున్నారు. దీంతో వరంగల్ నగరాన్ని హైసెక్యూరిటీ
భారత ప్రధాని నరేంద్రమోదీ తెలంగాణ పర్యటనలో భాగంగా వరంగల్ కు జులై 8న వస్తున్నారు. దీంతో వరంగల్ నగరాన్ని హైసెక్యూరిటీ జోన్‌గా మార్చారు. SPG, కేంద్ర, రాష్ట్ర బలగాలతో అంచలంచెలుగా సెక్యూరిటీ ఇవ్వనున్నారు. కేంద్ర బలగాలు ముందస్తుగా నగరాన్ని ఆధీనంలోకి తీసుకున్నాయి. వరంగల్ చుట్టూ 20 కి.లో. మీటర్ల మేర 144 సెక్షన్ అమలు చేయనున్నారు. వరంగల్‌లో నో ఫ్లై జోన్ ఆంక్షలు అమలు చేస్తున్నారు.
హన్మకొండ, వరంగల్ జిల్లా కేంద్రాల్లో ప్రధాన మంత్రి పర్యటించే ప్రాంతాల్లోని గగనతలాన్ని నో ప్లై జోన్ గా ప్రకటించారు. ఈ ఉత్తర్వులను అనుసరించి ప్రధాన మంత్రి భద్రత దృష్ట్యా గురువారం నుంచి 8వ తేదీ సాయంత్రం వరకు వరంగల్, హన్మకొండ నగరానికి 20కిలో మీటర్ల వ్యాసార్థంలో గగనతలాన్ని నో ప్లై జోన్ గా మారింది. డ్రోన్, రిమోట్ కంట్రోల్‌తో పనిచేసే మైక్రో లైట్ ఎయిర్ క్రాఫ్ట్, పారాగ్లైడర్ లాంటివి ఎగరవేయడం పూర్తిగా నిషేధించారు. ఎవరైన వ్యక్తులుగాని, సంస్థలుగాని ఉత్తర్వులను అతిక్రమిస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోనున్నారు.
జులై 8 ఉదయం 9:25 గంటలకు ప్రత్యేక విమానంలో హకీంపేట విమానాశ్రయానికి ప్రధాని మోదీ చేరుకుంటారు. హెలికాప్టర్‌లో బయలుదేరి 10:15 గంటలకు వరంగల్ మామునూరు విమానాశ్రయానికి రానున్నారు. అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా భద్రకాళి ఆలయానికి వెళ్లి అమ్మవారిని దర్శించుకుంటారు. దర్శనం అనంతరం నేరుగా ఆర్ట్స్ కాలేజీ మైదానానికి వెళ్తారు. అక్కడి నుంచే అభివృద్ధి పనులకు వర్చువల్ గా శంకుస్థాపన చేస్తారు. ఉదయం 11:45 నుంచి మధ్యాహ్నం 12:20 గంటల వరకు పబ్లిక్ మీటింగ్‌లో ప్రసంగించనున్నారు. మధ్యాహ్నం 1:45 గంటలకు హకీంపేట నుంచి ప్రత్యేక విమానంలో రాజస్థాన్ బికనీర్‌కు పయనమవుతారు.