వైఎస్ షర్మిల అరెస్ట్
వైఎస్సార్టీపీ చీఫ్ వైఎస్ షర్మిలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆమెను బొల్లారం పోలీస్ స్టేషన్ కి తరలించారు
వైఎస్సార్టీపీ చీఫ్ వైఎస్ షర్మిలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆమెను బొల్లారం పోలీస్ స్టేషన్ కి తరలించారు. ట్యాంక్ బండ్ పై చేపట్టిన మౌన దీక్షను పోలీసులు భగ్నం చేశారు. రాష్ట్రంలో మహిళల పట్ల జరుగుతున్న ఆఘాయిత్యాలకు నిరసనగా వైఎస్ షర్మిల ట్యాంక్ బండ్ పై రాణి రుద్రమదేవి విగ్రహం వద్ద దీక్షకు దిగారు. తొలుత విగ్రహానికి నివాళులర్పించిన షర్మిల తర్వాత తాను సాయంత్రం వరకూ దీక్ష చేస్తున్నట్లు ప్రకటించారు.
ట్యాంక్ బండ్‌పై దీక్షకు దిగడంతో...
ఈ రాష్ట్రంలో మహిళలకు భద్రతలేదని షర్మిల ఆరోపించారు. ఏటా రాష్ట్రంలో ఇరవైవేలకు పైగా మహిళలపై అత్యాచారాలు జరుగుతున్నాయని ఆరోపించారు. మహిళలను కేసీఆర్ తనకు ఓట్లు వేసే యంత్రాలుగా చూస్తున్నారన్నారు. భరోసా యాప్ ఎక్కడుందని ఆమె ప్రశ్నించారు. రాష్ట్రం మహిళల పాలిట ల్యాండ్ మైన్ లా తయారైందని షర్మిల ఆరోపించారు. అధికార పార్టీ నేతలే మహిళలపై అత్యాచారాలకు పాల్పడుతున్నారన్నారు. దీక్షకు దిగిన వైఎస్ షర్మిలను పోలీసులు అరెస్ట్ చేసి బొల్లారం పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ సందర్భంగా వైెెఎస్సార్టీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. ఆందోళన చేశారు.