రాజాసింగ్‌పై మరో కేసు నమోదు
శ్రీరామనవమి శోభాయాత్ర సందర్భంగా రాజాసింగ్ చేసిన ప్రసంగం వివాదాస్పదంగా ఉందని పోలీసులు కేసు నమోదు చేశారు
బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌పై మరో కేసు నమోదయింది. శ్రీరామనవమి శోభాయాత్ర సందర్భంగా రాజాసింగ్ చేసిన ప్రసంగం వివాదాస్పదంగా ఉందని పోలీసులు కేసు నమోదు చేశారు. ఇటీవలే ముంబయిలోనూ రాజాసింగ్ పై పోలీసుల కేసు నమోదయింది.
శ్రీరామనవమి శోభాయాత్రలో...
ఇటీవలే రాజాసింగ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలతో జైలు జీవితం గడిపి వచ్చారు. న్యాయస్థానం కూడా ఎలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయవద్దని తెలిపింది. అయితే న్యాయస్థానం విధించిన షరతులను రాజాసింగ్ ఉల్లంఘించేలా వ్యవహరిస్తున్నారని పోలీసులు చెబుతున్నారు.