BRS : పాడి కౌశిక్ రెడ్డికి మరోసారి నోటీసులు
బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి పోలీసులు మరోసారి నోటీసులు జారీ చేశారు.;
బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి పోలీసులు మరోసారి నోటీసులు జారీ చేశారు. ఈరోజు విచారణకు హాజరు కావాలని ఆయనను కోరారు. అయితే తాను కరీంనగర్ కోర్టుకు హాజరు కావాల్సి ఉన్నందున ఈ నెల 17వ తేదీన విచారణకు హాజరవుతానని పాడికౌశిక్ రెడ్డి పోలీసులకు తెలిపారు. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో అధికారుల విధులను అడ్డుకోవడంపై పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే.
బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో...
ఈ కేసుకు సంబంధించి మసాబ్ ట్యాంక్ పోలీసులు పాడి కౌశిక్ రెడ్డికి నోటీసులు ఇచ్చారు. కరీంనగర్ జిల్లా సమీక్ష సమావేశంలో జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ పట్ల దురుసుగా వ్యవహరించినందుకు ఆయనపై నమోదయిన కేసులో పాడి కౌశిక్ రెడ్డి అరెస్టయి బెయిల్ పై బయటకు వచ్చారు. దీంతో కౌశిక్ రెడ్డికి మరోసారి నోటీసులు ఇచ్చారు.