Telangana : ఎమ్మెల్యే గారూ.. మా నియోజక వర్గానికి రావొద్దంటూ పోస్టర్లు

తెలంగాణలో బీజేపీ ఎమ్మెల్యేను ప్రజలు సంక్రాంతి వేళ వినూత్న రీతిలో తమన నిరసనను తెలియజేశారు;

Update: 2025-01-15 12:23 GMT

తెలంగాణలో బీజేపీ ఎమ్మెల్యేను ప్రజలు సంక్రాంతి వేళ వినూత్న రీతిలో తమన నిరసనను తెలియజేశారు. నిజామాబాద్ జిల్లా నందిపేట్ లో ఈ పోస్టర్లు కలకలం రేపుతున్నాయి. ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి హామీలపై నిలదీస్తూ ఈ పోస్టర్లను స్థానిక ప్రజలు వేసినట్లు చెబుతున్నారు. దీంతో ఇప్పుడు ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

ఎన్నికల ప్రచారంలో...
ఎన్నికల ప్రచారంలో బీజేపీ అభ్యర్థిగా రాకేష్ రెడ్డి ఇచ్చిన హామీలను గుర్తు చేస్తూ ప్రజలు ఈ పోస్టర్లను వేసినట్లు చెబుతున్నారు. రూపాయి వైద్యం, యువతకు ఉపాధి ఎక్కడ? గ్రామానికి పది ఇళ్లు ఏమయ్యాయి? అంటూ ఎన్నికల హామీలపై ప్రశ్నలు కురిపించారు. నందిపేట్ బస్టాండ్ వద్ద ఎమ్మెల్యేకు నిలదీస్తూ వెలసిన పోస్టర్లు కలకలం రేపుతున్నాయి.


Tags:    

Similar News