Breaking : కేటీఆర్ కు సుప్రీంకోర్టులోనూ ఎదురుదెబ్బ

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు సుప్రీంకోర్టులోనూ ఎదురు దెబ్బతగిలింది.;

Update: 2025-01-15 06:54 GMT

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు సుప్రీంకోర్టులోనూ ఎదురు దెబ్బతగిలింది. హైకోర్టు ఆదేశాలపై తాము జోక్యం చేసుకోలేమని తెలిపింది. ఫార్ములా ఈ రేసు కేసులో పూర్తి స్థాయి విచారణ జరగాలని సుప్రీంకోర్టు తెలిపింది. దీంతో సుప్రీంకోర్టులోనూ కేటీఆర్ కు నిరాశ ఎదురయింది. పూర్తి స్థాయి విచారణ జరిగితేనే ఈ విషయంలో వాస్తవాలు వెలుగు చూస్తాయని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది.

హైకోర్టు ఆదేశాలను...
కేటీఆర్ పిటిషన్ పై ఈరోజు సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఫార్ములా – ఈ కారు రేసింగ్ కేసులో ఆయన ఈ నెల 8న సుప్రీంకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు ఉత్తర్వులను సవాల్ చేస్తూ కేటీఆర్ పిటిషన్ దాఖలు చేశారు. తనపై ఏసీబీ నమోదు చేసిన కేసును క్వాష్ చేయాలంటూ కేటీఆర్ తొలుత తెలంగాణ హైకోర్టును ఆశ్రయించగా, అందుకు ఉన్నత న్యాయస్థానం నిరాకరించింది. దీంతో ఆయన సుప్రీంకోర్టులో హైకోర్టు ఉత్తర్వులను సవాల్ చేశారు. కేటీఆర్ పిటిషన్‌పై జస్టిస్ బేలా ఎం త్రివేది, జస్టిస్ ప్రసన్న వర్లె ధర్మాసనం విచారణ చేపట్టింది. దీంతో కేటీఆర్ పిటషన్ ను విత్ డ్రా చేసుకున్నారు.


Tags:    

Similar News