Revanth Reddy : నేడు సింగపూర్ కు రేవంత్ రెడ్డి

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు సింగపూర్ వెళ్లనున్నారు. దావోస్ పర్యటనకు బయలుదేరి వెళ్లనున్నారు;

Update: 2025-01-16 02:30 GMT

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు సింగపూర్ వెళ్లనున్నారు. ఈరోజు రాత్రికి సింగపూర్ కు వెళ్లి రెండు రోజులు అక్కడ పర్యటించనున్నారు. అనంతరం దావోస్ పర్యటనకు అక్కడి నుంచి బయలుదేరి వెళతారు. ఢిల్లీలోనే ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు పలువురు కేంద్ర మంత్రులను కలవనున్నారు. ఉదయం ఉక్కు పరిశ్రమాల శాఖ మంత్రి కుమారస్వామిని కలవనున్నారు. ఆయనతో జరిగే భేటీలో తెలంగాణకు సంబంధించిన పలు కీలక అంశాలను చర్చించనున్నారు.

నేడు కేంద్రమంత్రులతో భేటీ...
అనంతరం మరికొందరు కేంద్రమంత్రులను కలవనున్నారని అధికారిక వర్గాలు వెల్లడించాయి. అయితే నేటి రాత్రికి వారం రోజుల పర్యటన నిమిత్తం దావోస్ కు బయలుదేరి వెళ్లనున్నారు. దావోస్ లో జరిగే పెట్టుబడుల సదస్సు లో పాల్గొని రాష్ట్రానికి రావాల్సిన పెట్టుబడుల గురించి వివిధ పారిశ్రామికవేత్తలతో చర్చించనున్నారు. గత ఏడాది కంటే ఈ ఏడాది అధిక మొత్తంలో పెట్టుబడులు తెచ్చే దిశగా రేవంత్ బృందం దావోస్ బయలుదేరి వెళ్లనుంది. అత్యధిక పెట్టుబడులు సాధించే లక్ష్యంతోనే దావోస్ పర్యటనకు బయలుదేరి వెళ్లనుంది.


Tags:    

Similar News