Koushik Reddy : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పై కేసు
బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పై పోలీసు కేసు నమోదయింది. మూడు కేసులు నమోదయ్యాయి.;
బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పై పోలీసు కేసు నమోదయింది. మూడు కేసులు నమోదయ్యాయి. నిన్న కరీంనగర్ జిల్లా అభివృద్ధి సమీక్ష సమావేశంలో జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ పై దాడికి యత్నించారని కౌశిక్ రెడ్డి పై కేసు నమోదయింది. ఎమ్మెల్యే సంజయ్ పట్ల దురుసుగా ప్రవర్తించడమే కాకుండా, ఆయన పీఏ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కరీంనగర్ వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు.
మొత్తం మూడు కేసులు...
సమావేశంలో గందరగోళం సృష్టించడమే కాకుండా మీటింగ్ ను కౌశిక్ రెడ్డి పక్కదారి పట్టించారంటూ ఆర్డీఓ ఇచ్చిన ఫిర్యాదు మేరకు మరొక కేసు పాడి కౌశిక్ రెడ్డిపై నమోదయింది. అలాగే తన పట్ల దురుసుగా వ్యవహరించారని గ్రంధీయల ఛైర్మన్ మల్లేశం ఇచ్చిన ఫిర్యాదు పై కూడా పాడి కౌశిక్ రెడ్డిపై కేసు నమోదయింది. మొత్తం మూడు కేసులను పాడి కౌశిక్ రెడ్డిపై కరీంనగర్ పోలీసులు నమోదు చేశారు.