Money Seized in election code : లక్షల రూపాయల నగదు స్వాధీనం

నిన్న ఒక్కరోజే హైదరాబాద్ నగరంలో 16.4 లక్షల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.;

Update: 2024-03-20 04:01 GMT

Money Seized in election code :నిన్న ఒక్కరోజే హైదరాబాద్ నగరంలో 16.4 లక్షల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ నగదుతో పాటు పది లక్షల విలువైన బంగారం, వెండి వస్తువులను కూడా స్వాధీనం చేసుకున్నటల్లు జిల్లా ఎన్నికల అధకిారి రొనాల్డ్ రాస్ తెలిపారు. ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిన తర్వాత హైదరాబాద్ నగరంలో పోలీసులు అనేక చోట్ల చెక్ పోస్టులు పెట్టి తనిఖీలు నిర్వహిస్తున్నారు. ప్రతి వాహనాన్ని తనిఖీ చేస్తూ అందులో నగదు, ఇతర వస్తువులను తరలిస్తున్నారన్న దానిపై సోదాలు నిర్వహిస్తున్నారు.

నగదుతో పాటు...
ఎన్నికల సమయంలో నగదును, ఇతర వస్తువులను చేరవేసేందుకు ప్రయివేటు వాహనాలతో పాటు బస్సులను కూడా తనిఖీ చేస్తున్నామని ఆయన తెలిపారు. యాభై వేల రూపాయలకు మించి నగదు ఉంటే అందుకు తగిన లెక్కలు చెప్పాల్సి ఉంటుందని, తగిన ఆధారాలు చూపించకపోతే వాటిని సీజ్ చేస్తామని హెచ్చరించారు. అలాగే ఎక్కువ మొత్తంలో బంగారం, వెండి వస్తువులు తీసుకెళ్లినా దానికి సంబంధించి రశీదులను చూపించాలని ఆయన కోరారు. ప్రధానంగా వ్యాపారులు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలని అధికారులు కోరుతున్నారు. అక్రమ మద్యాన్ని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.


Tags:    

Similar News