Telangana Elections : అక్కడ పోలింగ్ ముగిసింది
సాయంత్రం నాలుగు గంటలకు మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో పోలింగ్ ముగిసింది
సాయంత్రం నాలుగు గంటలకు మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో పోలింగ్ ముగిసింది. మిగిలిన చోట్ల సాయంత్రం ఐదు గంటల వరకూ పోలింగ్ కు కేంద్ర ఎన్నికల సంఘం అనుమతించింది. కానీ కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో మావోయిస్టుల ప్రాంతాల్లో సాయంత్రం నాలుగు గంటలకే అనుమతించింది. దీంతో దాదాపు పదమూడు నియోజకవర్గాల్లో పోలింగ్ ముగిసింది.
పదమూడు నియోజకవర్గాలలో...
మావోయిస్టు ప్రభావిత కేంద్రాల్లో మొత్తం 600 పోలింగ్ స్టేషన్లున్నాయి. సిర్పూర్, చెన్నూరు, బెల్లంపల్లి, మంచిర్యాల, ఆసిఫాబాద్, మంధని, భూపాలపల్లి, ములుగు, పినపాక, ఇల్లందు, కొత్తగూడెం, అశ్వారావుపేట, భద్రాచలం నియోజకవర్గాల్లో సాయంత్రం నాలుగు గంటల వరకే పోలింగ్ జరిగింది. అయితే క్యూ లైన్ లో ఉన్న వారిని ఓటు వేసేందుకు అనుమతిస్తున్నారు. ఈ పోలింగ్ స్టేషన్ల వద్ద పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు.