ఆ వార్తల్లో నిజం లేదు: పొన్నం ప్రభాకర్‌

హైదరాబాద్‌ బల్కంపేట ఎల్లమ్మ కల్యాణ వేడుకల‌కు హాజ‌రైన‌ మంత్రి పొన్నం ప్రభాకర్‌, మేయర్‌ గద్వాల విజయలక్ష్మి

Update: 2024-07-09 09:13 GMT

హైదరాబాద్‌ బల్కంపేట ఎల్లమ్మ కల్యాణ వేడుకల‌కు హాజ‌రైన‌ మంత్రి పొన్నం ప్రభాకర్‌, మేయర్‌ గద్వాల విజయలక్ష్మి ప్రొటోకాల్‌ పాటించడం లేద‌ని అలిగి ఆలయం బయటే కూర్చుండిపోయారని పలు మీడియా సంస్థల్లో కథనాలు వచ్చాయి.

ఈ విష‌య‌మై మంత్రి పొన్నం ప్రభాకర్‌ స్పందించారు. తాను అలిగిన‌ట్లు వ‌చ్చిన వార్త‌ల్లో నిజం లేద‌ని..అమ్మ‌వారి భక్తులు ఎందుకు అలుగుతామ‌న్నారు. మ‌హిళ‌లు వెళ్లే స‌మ‌యంలో తోపులాట జ‌రిగింద‌ని తెలిపారు. దాంతో మేయ‌ర్ కూడా తోపులాట‌లో ఇబ్బంది ప‌డ్డార‌న్నారు. తోపులాట‌ను నిలువ‌రించేందుకు కొద్దిసేపు ఆగిన‌ట్లు మంత్రి పొన్నం తెలిపారు. మహిళా రిపోర్టర్‌కు ఎదురైన చేదు అనుభ‌వానికి క్ష‌మాప‌ణ‌లు చెప్పారు.
హైదరాబాద్‌ బల్కంపేట ఎల్లమ్మ కల్యాణోత్సవం కోసం చేసిన ఏర్పాట్లలో నిర్లక్ష్యంపై మంత్రి పొన్నం ప్రభాకర్‌, మేయర్‌ గద్వాల విజయలక్ష్మి ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆలయం బయటే కూర్చుండిపోయిన వీడియోలు వైరల్ అయ్యాయి. కల్యాణోత్సవానికి ఏర్పాట్లు చేసిన హైదరాబాద్‌ కలెక్టర్‌ అనుదీప్‌పై సీరియస్‌ అయ్యారు. వీఐపీలు వస్తున్న సమయంలో ఆలయం ఎదుట సరైన సెక్యూరిటీ లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ తర్వాత ఫోన్లు తీసి పలువురికి కాల్స్ కూడా చేశారు. అయితే తాను అలగలేదని పొన్నం ప్రభాకర్‌ తాజాగా వివరణ ఇచ్చారు.


Tags:    

Similar News