ఉప్పల్ స్టేడియంకు పవర్ కట్

హైదరాబాద్ ఉప్పల్ క్రికెట్ స్టేడియంకు విద్యుత్ అధికారులు పవర్ కట్ చేశారు.

Update: 2021-12-15 09:02 GMT

హైదరాబాద్ ఉప్పల్ క్రికెట్ స్టేడియంకు విద్యుత్ అధికారులు పవర్ కట్ చేశారు. నిత్యం ఏదొక వివాదంతో చర్చలో ఉండే హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఈసారి విద్యుత్ లొల్లిలో చిక్కుకుంది. హెచ్ సీఏ విద్యుత్ సంస్థకు రూ.3 కోట్లకు పైగా బకాయిలను ఎగ్గొట్టింది. వారంరోజుల్లోగా ఆ బకాయిలను చెల్లించాలని, అప్పుడు విద్యుత్ ను పునరుద్ధరిస్తామని నోటీసులు కూడా పంపారు. నోటీసులు పంపినా హెచ్ సీఏ నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో విద్యుత్ అధికారులు నిన్న మధ్యాహ్నం నుంచి విద్యుత్ సరఫరా నిలిపివేశారు.

పోలీసులకు ఫిర్యాదు...
అయితే పవర్ కట్ చేసిన తర్వాత కూడా హెచ్ సీఏ అక్రమంగా విద్యుత్ ను వినియోగించడాన్ని అధికారులు గమనించారు. బకాయిలు చెల్లించమని నోటీసులు పంపిస్తే.. పట్టించుకోకుండా అక్రమంగా విద్యుత్ వాడుకుంటున్న యాజమాన్యంపై అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. కేసు నమోదైంది. దీనిపై స్పందించిన ప్రస్తుత హెచ్ సీఏ అజార్.. రూ.3 కోట్ల విద్యుత్ బకాయిలు మేమెందుకు కడతామని ఎదురు ప్రశ్నించారు. 2015-16 లో వివేక్ ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు క చేసిన తప్పుకు తమ బాధ్యత కాదని నిర్లక్ష్యంగా సమాధానమిచ్చారు.


Tags:    

Similar News