రాజ్భవన్ విందుకు కేసీఆర్ దూరం

రాజ్‌భవన్ లో జరిగే విందులో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పాల్గొననున్నారు. ఈ కార్యక్రమానికి కేసీఆర్ దూరంగా ఉండనున్నారు

Update: 2022-12-26 12:44 GMT

కాపేపట్లో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాజ్భవన్ కు రానున్నారు. రాజ్భవన్ లో జరిగే విందులో ఆమె పాల్గొననున్నారు. శీతాకాల విడిది కోసం హైదరాబాద్ వచ్చిన ద్రౌపది ముర్ము ఈరోజు గవర్నర్ ఇచ్చే విందులో పాల్గొననున్నారు. అయితే రాజ్భవన్ లో విందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ దూరంగా ఉండే అవకాశాలున్నాయి. రాత్రి ఏడు గంటలకు రాజ్భవన్ లో ఈ విందు జరగనుంది. అంతకు ముందు హకీంపేట ఎయిర్పోర్టుకు చేరుకన్న రాష్ట్రపతికి కేసీఆర్ స్వాగతం పలికారు. చాలా రోజుల తర్వాత ఒకే వేదికపై గవర్నర్, సీఎం కలుసుకున్నారు.

మంత్రులు కూడా...
హకీంపేటలో గవర్నర్ తమిళి సై సౌందర్ రాజన్ లు, సీఎం కేసీఆర్ ఒకరినొకరు పలకరించుకున్నారు. కానీ రాజ్భవన్ కు మాత్రం రావడం లేదని తెలిసింది. రాజ్భవన్ కు మంత్రులు కూడా హాజరయ్యే అవకాశాలు లేవు. కేవలం అధికారులు మాత్రమే హాజరవుతారని తెలిసింది. గవర్నర్, ముఖ్యమంత్రికి మధ్య గ్యాప్ పెరిగిన నేపథ్యంలో రాజ్భవన్ కు కేసీఆర్ వెళ్లే అవకాశాలు లేవు. రాష్ట్రపతి ఈ నెల 30వ తేదీన యాదాద్రి ఆలయానని దర్శించుకోనున్నారు. అక్కడ రాష్ట్రపతి పర్యటనకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.


Tags:    

Similar News