నేడు భద్రాచలానికి రాష్ట్రపతి

భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నేడు భద్రాచలంలో పర్యటించనున్నారు. సీతారామచంద్ర స్వామి వారిని దర్శించుకోనున్నారు.;

Update: 2022-12-28 02:17 GMT
నేడు భద్రాచలానికి రాష్ట్రపతి
  • whatsapp icon

భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నేడు భద్రాచలంలో పర్యటించనున్నారు. సీతారామచంద్ర స్వామి వారిని దర్శించుకోనున్నారు. దీంతో భద్రాచలంలో 144 సెక్షన్ ను ఏర్పాటు చేశారు. ఉదయం ఎనిమిది గంటల నుంచి 11.30 గంటల వరకూ అన్ని దర్శనాలను రద్దు చేశారు. ఉదయం పది గంటలకు రాష్ట్రపతి సారపాక ఐటీసీ హెలిప్యాడ్ చేరుకుంటారు. అక్కడి నుంచి రామాలయానికి వెళ్లి ప్రత్యేక పూజలను నిర్వహించనున్నారు.

ఇళ్ల నుంచి బయటకు రావద్దు....
అనంతరం కేంద్ర ప్రభుత్వ పథకమైన ప్రసాద్ పథకంకింద పలు కార్యక్రమాలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శంకుస్థాపన చేస్తారు. అనంతరం వనవాసి కల్యాణ పరిషత్ ఆధ్వర్యంలో సమ్మక్క సారలమ్మ గిరిజన పూజారులతో ద్రౌపది ముర్ము భేటీ అవుతారు. అనంతరం మధ్యాహ్న భోజన విరామం తర్వాత రామప్ప ఆలయాన్ని సందర్శించడానికి వెళతారు. భద్రాచలం, సారపాకల్లో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. రాష్ట్రపతి పర్యటన పూర్తయ్యేంత వరకూ ఇళ్లకే పరిమితం కావాలని చెప్పారు.


Tags:    

Similar News