వందేభారత్ ను ప్రారంభించిన మోదీ
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కు చేరుకున్న ప్రధాని నరేంద్ర మోదీ సికింద్రాబాద్ - తిరుపతి వందేభారత్ రైలును ప్రారంభించారు.;
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కు చేరుకున్న ప్రధాని నరేంద్ర మోదీ సికింద్రాబాద్ - తిరుపతి వందేభారత్ రైలును ప్రారంభించారు. ఆయన జెండా ఊపి ఈరైలును ప్రారంభించారు. ప్రధాని నరేంద్ర మోదీ జెండా ఊపి రైలును ప్రారంభించారు. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఇది శుభవార్త అని చెప్పాలి. సికింద్రాబాద్ నుంచి వందే భారత్ రైలు తిరుపతికి త్వరితగతిన చేరుకోవడానికి ఈ రైలు ఎంతగానో ఉపయోగపడుతుంది.
తెలుగు ప్రజలకు...
తెలంగాణలో వందేభారత్ ఎక్స్‌ప్రెస్ ఇది రెండోది. దేశంలో 13వ వందే భారత్ రైలును మోదీ ప్రారంభించారు. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ కు వచ్చిన తొలి ప్రధానిగా నరేంద్ర మోదీ గుర్తింపు పొందారు. అంతకు ముందు రైలులో విద్యార్థులతో ప్రత్యేకంగా మాట్లాడారు. ప్రధాని వెంట కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్, మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్‌లు పాల్గొన్నారు.