పుష్ప-2 టీజర్ సీన్ నిజంగానే జరిగింది

తెలంగాణలోని నల్లమల అడవుల్లోని ఆర్మాబాద్ టైగర్ రిజర్వ్‌లో "పుష్ప-2" సినిమా టీజర్‌లోని సన్నివేశాల మాదిరిగా

Update: 2024-02-26 05:10 GMT

పుష్ప-2 సినిమా టీజర్ చూశారుగా.. పుష్ప కనిపించకపోవడంతో జనమంతా ఏమయ్యాడో పుష్ప అంటూ తెగ టెన్షన్ పడుతూ ఉంటారు. ఇంతలో పుష్ప అడవిలోని కెమెరాలకు చిక్కుతాడు. పులి కూడా పుష్ప ను చూసి భయపడి వెనక్కు అడుగులు వేస్తుంది. ఇందుకేముంది మన పుష్ప బతికే ఉన్నాడు అంటూ సినిమాలో ఆయన అభిమానులు తెగ ఆనందపడిపోతూ ఉంటారు. అయితే ఇప్పుడు తెలంగాణలో అలాంటిదే చోటు చేసుకుంది. అడవిలో పార్టీ చేసుకుంటున్న వేటగాళ్లు కెమెరాలకు అడ్డంగా దొరికిపోయారు.

తెలంగాణలోని నల్లమల అడవుల్లోని ఆర్మాబాద్ టైగర్ రిజర్వ్‌లో "పుష్ప-2" సినిమా టీజర్‌లోని సన్నివేశాల మాదిరిగానే ఒక నిజ జీవిత సంఘటన జరిగింది. వన్యప్రాణుల నిఘా కెమెరాల్లో నలుగురు వేటగాళ్లు నైట్ విజన్ కెమెరా ట్రాప్ లో దొరికిపోయారు. అటవీశాఖ అధికారులు నలుగురు వేటగాళ్లలో ముగ్గురిని పట్టుకున్నారు. అమ్రాబాద్ టైగర్ రిజర్వ్‌లోని పాండిగుండం పరిధిలోని దట్టమైన ఉమ్మన్ పెంట బీట్‌లో అటవీ అధికారులు కెమెరాలను ఏర్పాటు చేశారు. ఫిబ్రవరి 23న, కెమెరా డేటాను అటవీ సిబ్బంది పరిశీలించినప్పుడు.. ఫిబ్రవరి 2, 2024న, కెమెరా ట్రాప్ ఫేజ్ 4లో భాగంగా నలుగురు వేటగాళ్లను గుర్తించారు. పోలీసులు ముగ్గురిని అరెస్టు చేయగా, ఒకరు పరారీలో ఉన్నారు. అరెస్టయిన దాసరి లాలు, దాసరి శ్రీను, జెల్లి కృష్ణ అమ్రాబాద్ టైగర్ రిజర్వ్‌లోని మారుమూల మద్ది మడుగు గ్రామానికి చెందినవారు. నిందితుల్లో మరొక వ్యక్తి.. కాశమోని రామన్ తప్పించుకోగలిగాడు. అతని కోసం అటవీ అధికారులు వెతుకులాట మొదలుపెట్టారు.


Tags:    

Similar News