భారీ వర్షాలు పడే అవకాశం.. అప్రమత్తమవ్వండి!

తెలంగాణ రాష్ట్రంలో మళ్లీ వర్షాలు మొదలయ్యాయి. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో

Update: 2023-08-19 02:10 GMT

తెలంగాణ రాష్ట్రంలో మళ్లీ వర్షాలు మొదలయ్యాయి. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో శుక్రవారం ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. శనివారం కూడా రాష్ట్రంలో భారీ వర్షాలు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. ప్రజలు, అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

ఈశాన్య బంగాళాఖాతం,దానిని ఆనుకుని ఉన్న తూర్పు మధ్య బంగాళాఖాతంలో బుధవారం కొనసాగిన అల్పపీడన ద్రోణి వాయువ్య బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాలకు విస్తరించింది. దీంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తూ ఉన్నాయి. తెలంగాణలో నేడు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. పలు జిల్లాలకు వాతావరణ శాఖ అధికారులు ఎల్లో అలర్ట్‌లు జారీ చేశారు. ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌, నిర్మల్‌, మంచిర్యాల, నిజామాబాద్‌, జగిత్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, సిరిసిల్ల, కరీంనగర్‌, ములుగు, కొత్తగూడెం, సంగారెడ్డి, మల్కాజ్‌గిరి, హైదరాబాద్‌, రంగారెడ్డి జిల్లాలకు అధికారులు ఎల్లో అలర్ట్‌ జారీ చేశారు. కామారెడ్డి, మెదక్‌, సిద్దిపేట, హన్మకొండ, వరంగల్‌, జనగాం, భువనగిరి, మహబూబాబాద్‌, ఖమ్మం, సూర్యాపేట, నల్గొండ, నాగర్‌కర్నూల్‌, వనపర్తి, మహబూబ్‌నగర్‌, వికారాబాద్‌, నారాయణపేట్‌, గద్వాల్‌ జిల్లాల్లో గ్రీన్‌ అలర్ట్‌ జారీ చేశారు.


Tags:    

Similar News