కమ్మవారికి ఇచ్చే సీట్లపై.. రేణుక సంచలన వ్యాఖ్యలు
ఎన్నికలు దగ్గర పడే కొద్దీ కాంగ్రెస్ పార్టీలో దుమారం ఇంకా చల్లారలేదు. టికెట్ల విషయంలో
ఎన్నికలు దగ్గర పడే కొద్దీ కాంగ్రెస్ పార్టీలో దుమారం ఇంకా చల్లారలేదు. టికెట్ల విషయంలో పోట్లాట కొనసాగుతూనే ఉంది. కాంగ్రెస్ హైకమాండ్ సీట్ల విషయంలో ఆచితూచి ముందుకు వెళుతున్నా.. నేతల మధ్య మాత్రం కొట్లాటలు ఏ మాత్రం తగ్గడం లేదు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి డబ్బున్న వాళ్లకు కాకుండా.. దమ్మున్న వాళ్లకు టికెట్లు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ రేణుకా చౌదరి అన్నారు. పిల్లికి భిక్షం పెట్టినట్లు.. ఓడిపోయే టికెట్లు కమ్మ వర్గానికి ఇస్తామంటే కుదరదన్నారు. గ్రామాల్లో పట్టున్న లీడర్లను కట్ చేసి, ఎవరో కోన్ కిస్కా గాళ్లకు సీట్లు ఇచ్చుకుంటే చేతులు కాలుతాయని.. ఆ తర్వాత ఆకులు పట్టుకున్నా లాభం ఉండదని అన్నారు. కామన్ సెన్స్‌తో హైకమాండ్ బ్యాలెన్స్ చేసుకోవాలని సూచించారు. తాము అడుగుతున్నది సామాజిక న్యాయమని.. గతంలో ఒక సామాజిక వర్గానికి 38 సీట్లు ఇస్తే.. అందులో 8 మందే గెలిచారని, ఇప్పుడు ఇద్దరే మిగిలారని అన్నారు. కానీ, కమ్మ వర్గానికి ఒక్క టికెట్ కూడా ఇవ్వలేదని గుర్తుచేశారు.