కవిత స్టేట్‌మెంట్ రికార్డు చేయండి

బీజేపీలో చేరాలంటూ ఆహ్వానించారని ఎ‌మెల్సీ కల్వకుంట్ల కవిత స్టేట్ మెంట్ పోలీసులు రికార్డు చేయాలని రేవంత్ రెడ్డి కోరారు;

Update: 2022-11-18 12:52 GMT

తనను బీజేపీలో చేరాలంటూ కొందరు ఆహ్వానించారని ఎ‌మెల్సీ కల్వకుంట్ల కవిత స్టేట్ మెంట్ సిట్ పోలీసులు రికార్డు చేయాలని రేవంత్ రెడ్డి కోరారు. దీనిపై సీపీ ఆనంద్ విచారణ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. బీజేపీలోకి కవితను ఎవరు రమ్మన్నారో? ఎందుకు రమ్మన్నారో ప్రజలకు తెలియాలని రేవంత్ రెడ్డి కోరారు. ఈ విషయాన్ని కవిత స్వయంగా చెప్పడంతో వెంటనే ఆమెకు ఆఫర్ ఎవరు ఇచ్చారో వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు.

రాజకీయాలు కలుషితం...
బీజేపీ, టీఆర్ఎస్ లు కలసి తెలంగాణ రాజకీయాలను కలుషితం చేస్తున్నాయని రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. అమ్ముడు పోయిన ఎమ్మెల్యేలను నమ్ముకుని కేసీఆర్ రాజకీయం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. ఇలాంటి దిగజారుడు రాజకీయాలను గతంలో ఎన్నడూ చూడలేదన్నారు. రెండు పార్టీలకు వచ్చే ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పాలని రేవంత్ రెడ్డి కోరారు. ప్రజలను దోచుకుంటున్న ఈ పార్టీలను తరిమికొట్టాలని ఆయన పిలుపునిచ్చారు.


Tags:    

Similar News