ట్రాన్స్ జెండర్ ల సంక్షేమం కోసం కీలక నిర్ణయం తీసుకున్నరేవంత్ రెడ్డి.
భారతదేశ చరిత్ర లో..అన్ని రాష్ట్రాల్లో ఎన్నో పార్టీలు ప్రభుత్వాలు ఏర్పాటు చేశాయి..కానీ,ఏం రాష్ట్రంలోనూ కొలువు;
భారతదేశ చరిత్ర లో..అన్ని రాష్ట్రాల్లో ఎన్నో పార్టీలు ప్రభుత్వాలు ఏర్పాటు చేశాయి..కానీ,ఏం రాష్ట్రంలోనూ కొలువు తీరిన ప్రభుత్వం,తమ రాష్ట్రంలోఉన్న ట్రాన్స్ జెండర్ల సంక్షేమం గురించి ఆలోచించిన దాఖలాలు లేవు..కానీ తెలంగాణ రాష్ట్రంలో...రాష్ట్ర ఏర్పాటు కు సహకరించి, తెలంగాణ అవతరించిన తరువాత నిర్వహించిన మొదటి ఎన్నికల్లో ఓడిపోయి,ఎన్నో ఇబ్బందులు, ఒడిదుడుకులను ఎదుర్కొని,పది సంవత్సరాల తర్వాత అధికారం చేజిక్కించుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం... వినూత్నంగా ముందుకు సాగుతోంది...ఈ ప్రయత్నంలో భాగంగా...ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి మరో అడుగు ముందుకు వేసి, ట్రాన్స్ జెండర్ ల సంక్షేమం కోసం ప్రత్యేకంగా ప్రభుత్వ నియామకాల ప్రక్రియకు శ్రీకారం చుట్టారు..!!
ఈ ప్రక్రియ యొక్క ముఖ్య ఉద్దేశ్యం...
* ట్రాన్స్ జెండర్ లకు ఉపాధి కల్పన ..!! మరియు
* హైదరాబాద్ మహా నగరంలో ట్రాఫిక్ సమస్యను పరిష్కరించే ప్రయత్నం..!!
రెండు కీలకమైన సమస్యలను ఏక కాలంలో పరిష్కారించే ప్రయత్నమే..ఈ ప్రక్రియ కి నాంది..!! మన దేశంలో ట్రాఫిక్ సమస్యను ఎదుర్కొంటున్న ఐదు పెద్ద మహా నగరాల్లో.. హైదరాబాద్ ఒకటి...ముఖ్యమంత్రి తీసుకున్న ఈ చర్యతో... హైదరాబాద్లో ట్రాఫిక్ సమస్య మరింత గా తగ్గుముఖం పట్టి,ఇతర నగరాలకు ఉదాహరణ గా నిలిచే విధంగా అవ్వాలి..!! ట్రాన్స్ జెండర్ ల గుర్తింపు, నియామకం, ప్రత్యేక శిక్షణ అనంతరం,ఈ ట్రాన్స్ జెండర్ బృందాలు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులకు అండగా నిలుస్తారు..!! ముఖ్యమంత్రి తీసుకున్న ఈ చర్య లింగ వివక్షత ను రూపు మాపనడానికి.., అత్యుత్తమ ఉదాహరణ గా నిలువబోతుంది..!!