పొన్నం ప్రభాకర్ కు కీలక బాధ్యతలు అప్పజెప్పిన రేవంత్

మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఆహ్వానించే బాధ్యతను రేవంత్ రెడ్డి మంత్రి పొన్నం ప్రభాకర్ పై ఉంచారు

Update: 2024-12-05 07:12 GMT

తెలంగాణ రాష్ట్ర పండగ ఉత్సవాలకు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఆహ్వానించే బాధ్యతను రేవంత్ రెడ్డి మంత్రి పొన్నం ప్రభాకర్ పై ఉంచారు. స్వయంగా తెలంగాణ పండగకు, సచివాలయంలో ఈ నెల9న తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ జరుగుతుందని ఆయన తెలిపారు. ఆ విగ్రహావిష్కరణకు బీఆర్ఎస్ నేత, ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ ను కలిసి ఆహ్వానించాల్సిందిగా మంత్రి పొన్నం ప్రభాకర్ ను రేవంత్ రెడ్డి ఆదేశించారు.

కేసీఆర్ తో పాటు...
పొన్నం ప్రభాకర్ నేరుగా ఇన్విటేషన్ కార్డుతో వెళ్లి కేసీఆర్ ను కలసి తెలంగాణ తల్లి విగ్రహానికి రావాలని కోరాలని రేవంత్ రెడ్డి తెలిపారు. అలాగే బీజేపీ కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ లను కూడా ఆహ్వానించే బాధ్యతను పొన్నం ప్రభాకర్ పై రేవంత్ రెడ్డి ఉంచారు. అందరు కలసి నిర్వహించుకునే కార్యక్రమంలా దీనిని తీర్చి దిద్దాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు.


ఇప్పుడు Desh Telugu Keyboard యాప్ సహాయంతో మీ ప్రియమైన వారికి తెలుగులో సులభంగా మెసేజ్ చెయ్యండి. Download The App Now

Tags:    

Similar News