కేటీఆర్ కళ్ల ముందే రోడ్డు ప్రమాదం.. ఏమి చేశారంటే?
తెలంగాణ మంత్రి కేటీఆర్ మానవత్వాన్ని చాటుకున్నారు. ఆదివారం జగిత్యాల పర్యటనకు వెళ్లిన మంత్రి కేటీఆర్
తెలంగాణ మంత్రి కేటీఆర్ మానవత్వాన్ని చాటుకున్నారు. ఆదివారం జగిత్యాల పర్యటనకు వెళ్లిన మంత్రి కేటీఆర్ తిరిగి హైదరాబాద్‌కు వస్తున్న క్రమంలో రోడ్డు ప్రమాదం జరిగింది. వెంటనే స్పందించిన ఆయన క్షతగాత్రులను తన కాన్వాయ్‌లోని ఓ వాహనంలో ఆసుపత్రికి తరలించి. తన పెద్ద మనసును చాటుకున్నారు.
జగిత్యాల జిల్లా కోరుట్లకు చెందిన షేక్ సల్మాన్ డ్రైవర్ మహమ్మద్ జమీరొద్దీన్‌తో కలిసి కారులో హైదరాబాద్‌కు వెళ్తున్నారు. మెదక్ జిల్లా చేగుంట జాతీయ రహదారి బైపాస్ వద్దకు రాగానే రామాయంపేట నుంచి చేగుంటకు వెళ్తున్న రాణిగంజ్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సును ఢీకొట్టింది. ఈ ఘటనలో కారులో ఉన్న ఇద్దరు వ్యక్తులకు తీవ్రగాయాలయ్యాయి. అదే సమయంలో మంత్రి కేటీఆర్ జగిత్యాల నుంచి నిజామాబాద్ మీదుగా హైదరాబాద్ వెళ్తున్నారు. వెంటనే కాన్వాయ్ ఆపించి కారు దిగి వచ్చి క్షతగాత్రులను పరామర్శించారు. నీళ్లు తాగించి, తన కాన్వాయ్‌లోని ఓ వాహనంలో తూప్రాన్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌కు తరలించాలని అధికారులను ఆదేశించి, హైదరాబాద్‌కు బయలుదేరారు.