టీఆర్ఎస్ క్లీన్ స్వీప్.. ఆరు చోట్ల గెలుపు

స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల కోటాలో అధికార టీఆర్ఎస్ అన్ని స్థానాలను గెలుచుకుంది. ఆరు స్థానాలను తన ఖాతాలో వేసుకుంది.

Update: 2021-12-14 04:33 GMT

స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల కోటాలో అధికార టీఆర్ఎస్ పార్టీ అన్ని స్థానాలను గెలుచుకుంది. ఆరు స్థానాలను తన ఖాతాలో వేసుకుంది. నల్లగొండ జిల్లా నుంచి కోటిరెడ్డి, ఖమ్మం జిల్లా నుంచి తాతా మధు, ఆదిలాబాద్ జిల్లా నుంచి దండె విఠల్ విజయం సాధించారు.

ఆరు ఏకగ్రీవం....
ఇక మెదక్ జిల్లా నుంచి టీఆర్ఎస్ అభ్యర్థి యాదవరెడ్డి విజయం సాధించారు. కరీంనగర్ నుంచి పోటీ చేసిన భానుప్రకాష్, ఎల్. రమణలు కూడా గెలుపొందడంతో టీఆర్ఎస్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేసింది. మొత్తం 12 స్థానాలకు నోటిఫికేషన్ వెలువడగా ఆరు స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. మరో ఆరుస్థానాలకు ఎన్నికలు జరగ్గా ఆరింటిలోనూ కారు పార్టీ కైవనం చేసుకుంది.


Tags:    

Similar News