ఎస్సై కాలర్ పట్టుకున్న రేణుకా చౌదరి

కాంగ్రెస్ రాజ్ భవన్ ముట్టడి హింసాత్మకంగా మారింది. కార్యకర్తలు గతంలో ఎన్నడూ లేని విధంగా విధ్వసం సృష్టించారు.

Update: 2022-06-16 07:28 GMT

కాంగ్రెస్ రాజ్ భవన్ ముట్టడి హింసాత్మకంగా మారింది. కాంగ్రెస్ కార్యకర్తలు గతంలో ఎన్నడూ లేని విధంగా రోడ్లపైకి వచ్చి విధ్వసం సృష్టించారు. రోడ్లపై వాహనాలను తగులపెట్టడమే కాకుండా, ఆర్టీసీ బస్సులను ధ్వంసం చేశారు. రాహుల్, సోనియాలను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ విచారణను నిరసిస్తూ కాంగ్రెస్ చలో రాజ్ భవన్ కు పిలుపునిచ్చింది. కాంగ్రెస్ నేతలు పోలీసులపై తిరగబడ్డారు.

భట్టి విక్రమార్క కూడా...
సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క డీసీపీ జోవియల్ తో వాగ్వాదానికి దిగారు. ఆయనను పక్కనకు నెట్టవేశారు. చొక్కా పట్టుకున్నారు. మాజీ ఎంపీ రేణుకా చౌదరి అయితే ఒక ఎస్సై కాలర్ పట్టుకున్నారు. మహిళ పోలీసులను పక్కకు నెట్టారు. రేణుకచౌదరిని పోలీసు వ్యాన్ లోకి ఎక్కించేసరికి వారికి తల ప్రాణం తోకకు వచ్చింది. అంతసులువుగా రేణుక లొంగలేదు. మహిళ పోలీసులను సయితం వెనక్కు నెట్టారు. జగ్గారెడ్డి సయితం పోలీసులకు అంత సులువుగా లొంగలేదు. పోలీసులతో వాగ్వాదానికి దిగారు. దీనిపై ప్రభుత్వం సీరియస అయింది. ప్రభుత్వ ఆస్తులను నష్టం కలిగించిన కార్యకర్తలను గుర్తించి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించుకుంది.


Tags:    

Similar News