భగభగమంటున్న ఎండలు
తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి. ఉష్ణోగ్రతలు 40 నుంచి 45 డిగ్రీల వరకూ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.;
తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి. ఉష్ణోగ్రతలు 40 నుంచి 45 డిగ్రీల వరకూ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మార్చి నెలలో ఎండలు తీవ్రత కావడంతో ప్రజలు అనేక అవస్థలు పడుతున్నారు. మార్చి నెలలోనే వడ దెబ్బలు తగులుతున్నాయి. వడదెబ్బ మరణాలు సంభవిస్తుండటంతో ఆందోళన వ్యక్తమవుతుంది. ఉదయం నుంచి పది గంటల నుంచే ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటంతో ప్రజలు బయటకు రావడానికి భయపడిపోతున్నారు.
కోల్ మైన్స్ ప్రాంతాల్లో.....
ప్రధానంగా ఆదిలాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాల్లో ఎండల తీవ్రత ఎక్కువగా ఉంది. కోల్ మైన్స్ ఉన్న ప్రాంతాల్లో ఎండల తీవ్రత ఎక్కువగా ఉంది. బెల్లంపల్లి, మంథని, గోదావరిఖని, కొత్తగూడెం వంటి ప్రాంతాల్లో ఎండ తీవ్రత మరింత ఎక్కువగా ఉంది. రానున్న రోజుల్లో ఎండల తీవ్రత మరింత ఎక్కువవుతుందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ప్రజలు అప్రమత్తంగా లేకపోతే వడదెబ్బ మరణాలు మరింత ఎక్కువయ్యే అవకాశాలున్నాయి.