Telangana : గ్రూప్ వన్ మెయిన్స్ పై సుప్రీంకోర్టు ఆదేశాలివే
తెలంగాణ గ్రూప్ వన్ నోటిఫికేషన్ రద్దుపై సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది
తెలంగాణ గ్రూప్ వన్ నోటిఫికేషన్ రద్దుపై సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. గ్రూప్ వన్ నోటిఫికేషన్ ను రద్దు చేయాలంటూ కొందరు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారించిన సుప్రీంకోర్టు ధర్మాసనం అభ్యర్థులు వేసిన పిటీషన్ ను కొట్టివేసింది. గ్రూప్ వన్ నోటిఫికేషన్ ను రద్దు చేయడానికి సుప్రీంకోర్టు అంగీకరించలేదు. దీంతో సుప్రీంకోర్టులో కూడా అభ్యర్థులకు ఎదురుదెబ్బతగిలింది.
ప్రభుత్వానికి ఊరట...
రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఊరట లభించినట్లయింది. గ్రూప్ వన్ నోటిఫికేషన్ తో పాటు మెయిన్స్ ను కూడా వాయిదా వేయాలని పిటీషన్ వేశారు. అయితే ఈ పిటీషన్ ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. కొందరు అభ్యర్థులు హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చుస్తూ సుప్రీంకోర్టులో పిటీషన్ దాఖలు చేసిన పిటీషన్ ను తిరస్కరించడంతో గ్రూప్ వన్ మెయిన్స్ కు న్యాయపరంగా ఎలాంటి ఇబ్బంది లేదు. పరీక్షల నిర్వహణలో న్యాయస్థానాల జోక్యం అనవసరమని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది.