కవిత బెయిల్ పై షరతులివే.. విడుదల ఎప్పుడంటే?
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు బెయిల్ ఇస్తూ న్యాయస్థానం కొన్ని షరతులను విధించింది.
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు బెయిల్ ఇస్తూ న్యాయస్థానం కొన్ని షరతులను విధించింది. పాస్‌పోర్టును సమర్పించాలని ఆదేశించింది. విదేశాలలకు వెళ్లాలంటూ కోర్టు అనుమతి తీసుకోవాలని తెలిపింది. అంతే కాకుండా పది లక్షల రూపాయల పూచీకత్తును సమర్పించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.
విచారణకు...
దీంతో పాటు ప్రతి సారీ విచారణకు కవిత హాజరు కావాల్సి ఉంటుందని కూడా న్యాయమూర్తి జస్టిస్ గవాయ్ తెలిపారు. ఢిల్లీ హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టు కొట్టివేస్తూ కవితకు బెయిల్ మంజూరు చేసింది. కవిత బహుశ ఈరోజు సాయంత్రానికి తీహార్ జైలు నుంచి విడుదలయ్యే అవకాశాలున్నాయని న్యాయనపుణులు చెబుతున్నారు.