తెలంగాణలో స్వైన్ ఫ్లూ కలకలం.. నాలుగు కేసులు గుర్తించిన అధికారులు
తెలంగాణలో స్వైన్ ఫ్లూ కలకలం సృష్టిస్తుంది. స్వైన్ ఫ్లూతో బాధపడుతున్న నలుగురిని గుర్తించినట్లు వైద్య శాఖ తెలిపింది
తెలంగాణలో స్వైన్ ఫ్లూ కలకలం సృష్టిస్తుంది. గత కొద్ది రోజులుగా భారీ వర్షాలు కురుస్తుండటంతో చలి వాతావరణం నెలకొంది. వర్షాలు పడుతుండటం వల్లనే చలి వాతావరణం అనుకున్నప్పటికీ, స్వైన్ ఫ్లూ కేసులు బయటపడటంతో వైద్య శాఖ అధికారుల్లో ఆందోళన వ్యక్తమవుతుంది. స్వైన్ ఫ్లూతో బాధపడుతున్న నలుగురిని గుర్తించినట్లు వైద్య శాఖ అధికారులు తెలిపారు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో ఈ నాలగు కేసులు బయటపడినట్లు వైద్య శాఖ అధికారులు తెలిపారు.
ఈ జాగ్రత్తలు పాటిస్తే....
అయితే స్వైన్ ఫ్లూ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. ప్రజలు బయటకు వెళితే రద్దీ ఉన్న చోట మాస్క్ లు ధరించడంతో పాటు శుభ్రంగా చేతులు కడుక్కోవడంతో పాటు భౌతిక దూరం పాటించడం మేలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. స్వైన్ ఫ్లూ వేగంగా విస్తరించే అవకాశముందన్న ఆందోళన వ్యక్తమవుతుంది. అయితే వైద్య శాఖ అధికారులు మాత్రం తగిన జాగ్రత్తలు పాటిస్తే స్వైన్ ఫ్లూ నుంచి తమను తాము ప్రజలు కాపాడుకోవచ్చని చెబుతున్నారు. ఏమాత్రం జలుబు, దగ్గు అనిపించినా వెంటనే వైద్యపరీక్షలు చేయించుకోవాలని సూచిస్తున్నారు.