తెలుగు రాష్ట్రాల కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జ్ లు మారారు

సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు

Update: 2023-12-23 15:02 GMT

congress new incharges 

సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కొత్త ఇన్చార్జిలను నియమించింది. ఏపీ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జిగా మాణికం ఠాగూర్ ను నియమించింది. మాణికం ఠాగూర్ కు అండమాన్ నికోబార్ దీవుల కాంగ్రెస్ వ్యవహారాల పర్యవేక్షణ బాధ్యతలు కూడా అప్పగించింది. దీపా దాస్ మున్షీని తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జిగా నియమించారు. ఇప్పటివరకు తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జిగా మాణిక్ రావ్ ఠాక్రే వ్యవహరించారు. కర్ణాటక కాంగ్రెస్ ఇన్చార్జిగా రణదీప్ సింగ్, తమిళనాడు-పుదుచ్చేరి-ఒడిశా ఇన్చార్జిగా డాక్టర్ అజయ్ కుమార్ లను నియమిస్తూ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఉత్తర్వులు జారీ చేశారు.

దీపదాస్ మున్షీ వచ్చారు
తెలంగాణ కాంగ్రెస్ కొత్త ఇంఛార్జ్ గా దీపదాస్ మున్షి నియమించింది ఏఐసీసీ. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో దీపదాస్ మున్షీ తెలంగాణ ఎన్నికల పరిశీలకురాలిగా పనిచేశారు. ప్రస్తుతం తెలంగాణ ఇంఛార్జ్ గా ఉన్న మాణిక్ రావు థాక్రేను గోవా ఇంఛార్జ్ గా నియమించారు. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ ఇంఛార్జ్ గా మాణిక్కం ఠాకూర్ ను నియమించారు.


Full View


Tags:    

Similar News