Telanana Assembly : తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. సభ ప్రారంభం కాగానే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటన చేశారు
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. సభ ప్రారంభం కాగానే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటన చేశారు. తెలంగాణ తల్లి విగ్రహం పై ప్రకటన చేశారు. డిసెంబరు 9వ తేదీ తెలంగాణ ప్రజలకు పర్వదినం అని అన్నారు. డిసెంబరు 9న తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ప్రకటించారన్నారు. సోనియాగాంధీ జన్మదినం సందర్భంగా ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. అదే సమయంలో నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చిన సోనియాకు కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ ప్రజల భావోద్వేగాలను గుర్తించి, ఆత్మబలిదానాలను నివారించడానికే తెలంగాణ రాష్ట్రాన్ని సోనియా గాంధీ ఇచ్చారన్నారు.
తెలంగాణ తల్లి విగ్రహాన్ని...
తెలంగాణ ఆవిర్భవించిన రోజున సచివాలయంలో తెలంగాణ విగ్రహావిష్కరణకు సంబంధించి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. తెలంగాణ తల్లిని ఇప్పటి వరకూ అధికారికంగా ఆవిష్కరించుకోలేదన్నారు. ఆ తెలంగాణ తల్లిని రూపకల్పన చేసి నేడు సచివాలయంలో ఆవిష్కరించబోతున్నామని తెలిపారు. నాలుగు కోట్ల బిడ్డల మనోభావాలకు ప్రతిరూపంగా రూపుదిద్దుకుందని తెలిపారు. తెలంగాణ తల్లి రూపకల్పనలో సంప్రదాయలు, సంస్కృతులు, చారిత్రక విషయాలను పరిగణనలోకి తీసుకుని రూపొందించడం జరిగిందని తెలిపారు. సబ్బండ వర్గాలకు ప్రతిరూపంగా ఈ విగ్రహ రూపకల్పన జరిగిందనిచెప్పారు.