Telangana : గుడ్ న్యూస్ దీపావళికే ఇందిరమ్మ ఇళ్లు.. రైతులకు ఐదు వందల బోనస్

తెలంగాణ మంత్రి వర్గం పలు కీలక నిర్ణయాలను తీసుకుంది. మెట్రో రైలు విస్తరణ పనులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది

Update: 2024-10-27 02:07 GMT

తెలంగాణ మంత్రి వర్గం పలు కీలక నిర్ణయాలను తీసుకుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో మెట్రో రైలు విస్తరణ పనులపై సుదీర్ఘంగా చర్చించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాది గడుస్తున్న సమయంలో మెట్రో రైలు విస్తరణపై నిర్ణయం తీసుకుంది. నాగోలు నుంచి ఎల్బీనగర్ వరకూ, ఎల్బీ నగర్ నుంచి హయత్ నగర్ వరకూ, ఎల్బీనగర్ నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్టు వరకూ మెట్రో రైలు మార్గాలను విస్తరించాలని నిర్ణయించింది. దీంతో అనేక ప్రాంతాల వారికి మెట్రో రైలు అందుబాటులోకి రావడమే కాకుండా హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ సమస్యలకు చెక్ పడే అవకాశముందని భావించింది. వీలయినంత త్వరగా ఈ మెట్రో రైలు మార్గాల విస్తరణ పనులను చేపట్టేందుకు తెలంగాణ కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

దీపావళికి కానుకగా...
ఇక దీపావళికి పేద ప్రజలకు కానుకగా ఇందిరమ్మ ఇళ్లను తొలి విడత పనులను ప్రారంభించాలని, ఒక్కొక్క నియోజకవర్గానికి 3,500 ఇళ్లుఇవ్వాలని నిర్ణయిచింది. గ్రామ సభలను నిర్వహించి పారదర్శకంగా లబ్దిదారులను ఎంపిక చేయనున్నారు దీంతో పాటు రాష్ట్రంలో కుల గణను కూడా నవంబరు 30వ తేదీలోగా చేయాలని మంత్రి వర్గ సమావేశం నిర్ణయించింది. ధాన్యం సేకరణకు ఆరు వేల ధాన్యం కొనుగోలు కేంద్రాలను సత్వరం ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.
సన్న వడ్లకు బోనస్...
దీంతో పాటు ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో ప్రధానమైన రైతులకు మరో గుడ్ న్యూస్ కేబినెట్ చెప్పింది. సన్న వడ్లకు ఐదు వంద రూపాయల బోనస్ ఇవ్వాలని నిర్ణయించింది. ఈ ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. దీంతో పాటు ములుగు జిల్లాలో సమ్మక్క సారలమ్మ యూనివర్సిటీకి సెంట్రల్ యూనివర్సిటీకి ఎకరానికి రెండు వందల యాభై రూపాయల చొప్పున భూమిని కేటాయించేందుకు అంగీకరించింది. ఇక రెరాలో యాభై నాలు ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయాలని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ను ఆదేశాలు జారీ చేసింది. ఉస్మానియా ఆసుపత్రిని కొత్తగా నిర్మించేందుకు గోషా మహల్ పోలీసుల భూమిని బదలాయించేందుకు మంత్రి వర్గ సమావేశం ఆమోదం తెలిపింది.




Tags:    

Similar News