తెలంగాణ మంత్రి వర్గ సమావేశం రద్దు
ఎన్నికల కోడ్ అమలులో ఉండటంతో ఎన్నికల సంఘం అనుమతి లభించకపోవడంతో తెలంగాణ కేబినెట్ భేటీని రద్దు చేసుకున్నారు.
తెలంగాణ మంత్రి వర్గ సమావేశం వాయిదా పడింది. ఎన్నికల కోడ్ అమలులో ఉండటంతో ఎన్నికల సంఘం అనుమతి లభించకపోవడంతో కేబినెట్ భేటీని రద్దు చేసుకున్నారు. ఈరోజు సాయంత్రం తెలంగాణ మంత్రి వర్గ సమావేశమై పలు కీలక నిర్ణయాలు తీసుకోవాలని భావించింది. అజెండాను కూడా సిద్ధం చేసింది. కేబినెట్ భేటీ ఉంటుందని రెండు రోజుల క్రితమే ప్రభుత్వం ప్రకటించింది.
ఎన్నికల కోడ్ ఉండటంతో...
అయితే లోక్‌సభ ఎన్నికల కోడ్ అమలులో ఉండటంతో పాటు నల్లగొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక ఈ నెల 27వ తేదీన జరగనుండటంతో కేబినెట్ సమావేశానికి ఎన్నికల సంఘం అనుమతించలేదు. ఈ సమావేశంలో తీసుకునే నిర్ణయాలు గ్రాడ్యుయేట్ ఎన్నికలపై ప్రభావం చూపే అవకాశముందని భావించిన ఎన్నికల కమిషన్ అనుమతించలేదు. దీంతో జూన్ 4వ తేదీన ఓట్ల లెక్కింపు తర్వాతనే తెలంగాణ మంత్రి వర్గ సమావేశం జరనుంది.