నేడు తెలంగాణ కేబినెట్ భేటీ
నేడు తెలంగాణ మంత్రి వర్గ సమావేశం జరగనుంది. సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు.
నేడు తెలంగాణ మంత్రి వర్గ సమావేశం జరగనుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. ఆగస్టు 15 నుంచి పింఛన్ల పెంపుదలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. దీంతో పాటు రాష్ట్రానికి అదనపు వనరులు సమీకరణపై కూడా చర్చించనుంది. ఆగస్టు 15వ తేదీన పది లక్షల మందికి పింఛన్లు అదనంగా మంజూరు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనిపై చర్చించి ఆమోదించనున్నారు.
మునుగోడు ఉప ఎన్నిక..
ఇక కేంద్ర ప్రభుత్వం రుణాల తీసుకునేందుకు ఆంక్షలు విధించడంతో ప్రత్యామ్నాయ మార్గాలపై మంత్రివర్గం దృష్టి పెట్టనుంది. ఏ ఏ వనరుల ద్వారా నిధులను సేకరించాలన్న దానిపై సమావేశంలో చర్చించనున్నారు. దీనితో పాటు రాజకీయ పరిణామాలపై కూడా చర్చ జరగనుంది. మునుగోడు ఉప ఎన్నికకు సంబంధించి కూడా మంత్రి వర్గ సభ్యులతో ముఖ్యమంత్రి కేసీఆర్ చర్చించనున్నారని చెబుతున్నారు.