మంత్రి పువ్వాడకు కేసీఆర్ ఫోన్
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రి పువ్వాడ అజయ్ ను అభినందించారు. ఫోన్ చేసి అజయ్ ను కేసీఆర్ అభినందించారు;
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రి పువ్వాడ అజయ్ ను అభినందించారు. ఫోన్ చేసి అజయ్ ను కేసీఆర్ అభినందించారు. ఖమ్మం బీఆర్ఎస్ సభను సక్సెస్ చేసిన మంత్రి పువ్వాడ అజయ్ ను కేసీఆర్ ప్రశంసలతో ముంచెత్తారు. వచ్చిన నేతలందరూ హాజరైన జనాలను చూసి ఆశ్చర్యపోయారని, తొలి బీఆర్ఎస్ సభను ఖమ్మంలో ఏర్పాటు చేసి సక్సెస్ చేసినందుకు కేసీఆర్ మంత్రి పువ్వాడ అజయ్ ను ప్రత్యేకంగా అభినందించారు.
అభినందించిన కేసీఆర్....
బీఆర్ఎస్ సభకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సజావుగా సాగడమే కాకుండా ఖమ్మం జిల్లా చరిత్రలో ఎన్నడూ లేని విధంగా సభను నిర్వహించారని అజయ్ ను కేసీఆర్ ప్రశంసలతో ముంచెత్తారు. తక్కువ సమయంలోనే జనాలను సమీకరించడంలో గాని, పార్కింగ్ నుంచి అన్ని రకాల వసతులను కల్పించడంలో నిర్వాహకులు సక్సెస్ అయ్యారన్నారు. బీఆర్ఎస్ తొలి సభను సక్సెస్ చేసినందుకు మంత్రి అజయ్ కు కేసీఆర్ ఫోన్ చేసి మరీ అభినందనలు తెలిపారు.