ఒకేసారి "తొమ్మిది" ప్రారంభం
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు తొమ్మిది వైద్య కళాశాలలను ప్రారంభించబోతున్నారు.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు తొమ్మిది వైద్య కళాశాలలను ప్రారంభించబోతున్నారు. ఉదయం పదకొండు గంటలకు వర్చువల్ పద్ధతిలో ఈ మెడికల్ కళాశాలలను కేసీఆర్ ప్రారంభించనున్నారు. కామారెడ్డి, ఖమ్మం, జయశంకర్ భూపాలపల్లి, కొమురంభీం ఆసిఫాబాద్, నిర్మల్, రాజన్న సిరిసిల్ల, వికారాబాద్, జనగామ జిల్లాల్లోని మెడికల్ కాలేజీలను కేసీఆర్ ఒకేసారి ప్రారంభించనున్నారు. మంత్రులు ఒక్కో జిల్లా కళాశాల ప్రారంభోత్సవంలో ఒక్కొక్కరు పాల్టొంటారు.
మెడికల్ కళాశాలల ఏర్పాటుతో...
ప్రజలకు వైద్య సేవలు మరింత దగ్గర చేయడానికి ఈ కళాశాలు ఉపయోగపడతాయని బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. అంతేకాకుండా తెలంగాణకు చెందిన విద్యార్థులకు సీట్ల సంఖ్య కూడా పెరుగుతుందని, తద్వారా ఆరోగ్య తెలంగాణ దిశగా సాధించవచ్చన్నది బీఆర్ఎస్ నేతలు చెబుతున్న విషయం. ప్రధానంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు రెండున్నర లక్ష ర్యాంకు వచ్చినా, ఓసీ విద్యార్థులకు లక్షన్నర ర్యాంకు వచ్చినా సీటు గ్యారంటీగా వచ్చే అవకాశముంది. ఒకసారి తొమ్మిది మెడికల్ కళాశాలలను ప్రారంభించడం రికార్డు అని బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు.