ఢిల్లీలోనే కేసీఆర్.. మరో రెండు రోజులు?
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గత నాలుగు రోజుల నుంచి ఢిల్లీలోనే ఉన్నారు;
లంగాణ ఖ్యమంత్రి కేసీఆర్ గత నాలుగు రోజుల నుంచి ఢిల్లీలోనే ఉన్నారు. బీఆర్ఎస్ కార్యాలయాన్ని ప్రారంభించిన తర్వాత ఆయన అక్కడే ఉంటున్నారు. ఉత్తర భారత దేశానికి చెందిన ముఖ్యనేతలను ఆయన కలుస్తున్నారు. ముఖ్యంగా రైతు సంఘాల నేతలతో ఆయన సమావేశాలు జరుపుతున్నారు. రైతు సమస్యలకు పరిష్కారంపై ఆయన వారితో చర్చలు జరుపుతున్నారు. వారి నుంచి కూడా ఫీడ్ బ్యాక్ తీసుకుంటున్నారు.
రైతు సంఘాల నేతలతో...
ఉత్తర భారతదేశంలోని పలువురు నేతలు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను కలిసి అభినందనలు తెలుపుతున్నారు. వారితో బీజేపీ, కాంగ్రెస్ లకు వ్యతిరేకంగా ఏర్పాటు చేయాల్సిన కూటమిపై చర్చిస్తున్నారు. ఇక తెలంగాణ నుంచి కూడా అనేక మంది టీఆర్ఎస్ నేతలు క్యూ కట్టారు. కేసీఆర్ ను అభినందించి ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. కేసీఆర్ మరికొన్ని రోజులు ఢిల్లీలోనే ఉండే అవకాశముందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.