Breaking : కేసీఆర్ వెనుకంజ
కామారెడ్డి నియోజకవర్గంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వెనకంజలో ఉన్నారు
కామారెడ్డి నియోజకవర్గంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వెనకంజలో ఉన్నారు. పోస్టల్ బ్యాలట్ నుంచే ఆయన వెనుకబడి ఉన్నారు. ఈసారి కేసీఆర్ గతంలో ఎన్నడూ లేని విధంగా రెండు చోట్ల పోటీ చేయడం రాజకీయంగా చర్చనీయాంశమైంది. గజ్వేల్ నుంచి ఇప్పటికే రెండు సార్లు గెలిచిన కేసీఆర్ మూడోసారి కూడా అక్కడి నుంచి పోటీ చేస్తున్నారు.
లోకల్ .. నాన్ లోకల్...
కానీ కామారెడ్డిలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు పోటీగా పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి బరిలోకి దిగారు. అయితే కామారెడ్డిలో రేవంత్ రెడ్డి 700కు పైగా ఓట్ల ఆధిక్యతతో కొనసాగుతున్నారు. అక్కడ సీఎం కేసీఆర్ మూడో స్థానంలో ఉన్నట్లు తెలుస్తోంది. గజ్వేల్ లో మాత్రం స్వల్ప ఆధిక్యంలో ముందంజలో ఉన్నారు. ఇక్కడ ఈటల తర్వాత స్థానంలో ఉన్నారు.