బీజేపీ టార్గెట్ లో ఏపీ కూడా.. కేసీఆర్ కామెంట్స్

దేశంలో నాలుగు రాష్ట్రాలను పడగొట్టేందుకు బీజేపీ సిద్ధమయిందని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు

Update: 2022-11-03 15:50 GMT

దేశంలో నాలుగు రాష్ట్రాలను కూలగొట్టేందుకు బీజేపీ ప్రయత్నించిందన్న ఆధారాలు లభ్యమయ్యాయని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. అందులో ఆంధ్రప్రదేశ్ కూడా ఉందన్నారు. తెలంగాణ, ఏపీ, ఢిల్లీ, రాజస్థాన్ లను కూలగొట్టే ప్రయత్నం జరుగుతుందన్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునేందుకు అందరూ ముందుకు రావాలన్నారు. మేధావులు, యువత ముందుకు వచ్చి ఈ దారుణాలను అడ్డుకోవాలని ఆయన పిలుపు నిచ్చారు. ఈడీ, ఐటీ, సీబీఐలతో భయభ్రాంతులకు గురిచేస్తూ ఎమ్మెల్యేలను లోబర్చుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని కేసీఆర్ ఆరోపించారు.

న్యాయమూర్తులే....
తాను ఎనిమిదేళ్ల నుంచి మోదీకి సహచరుడిగా ఉన్నానని, ఇలాంటి అప్రజాస్వామిక చర్యలకు పూనుకోవద్దని ఆయన కోరారు. దేశంలో ఎమ్మెల్యేల కొనుగోలు చేయడానికి ఇంత డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయని ఆయన ప్రశ్నించారు. ఇప్పుడు ఊరుకుంటే ఇక దేశం అంతటా వీరు స్వైర విహారం చేస్తారన్నారు. దేశవ్యాప్తంగా ఈ ఎమ్మెల్యేల కొనుగోళ్లపై చర్చ జరగాలని కేసీఆర్ అభిప్రాయపడ్డారు. అత్యధిక మెజారిటీతో గెలిచిన ప్రభుత్వాలను ఏ రకంగా కూలగొడతారన్నారు. ఇప్పటి వరకూ ఎమ్మెల్యేల కొనుగోళ్లకు 12 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు వారు చెప్పడం దురదృష్టకరమని తెలిపారు. ఇంత ఓపెన్ గా చెబుతుంటే ఇక ప్రజాస్వామ్యాన్ని ఎవరు రక్షిస్తారన్నారు. న్యాయమూర్తులే ఈ దేశాన్ని రక్షించాలని, కుట్రదారులకు శిక్ష పడేలా చూడాలని ఆయన కోరారు.


Tags:    

Similar News