అబద్దాలైతే నేను రాజీనామాకు సిద్ధం

తాను చెప్పేది అబద్ధాలైతే రాజీనామా చేసేందుకు కూడా వెనుకాడనని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు

Update: 2022-09-12 07:22 GMT

తాను చెప్పేది అబద్ధాలైతే రాజీనామా చేసేందుకు కూడా వెనుకాడనని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. అసెంబ్లీలో విద్యుత్ చట్ట సవరణ బిల్లుపై జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో విద్యుత్ విషయంలో తెలంగాణ ప్రజలు అనేక ఇబ్బందులు పడ్డారన్నారు. బిల్లులు కట్టలేదని నాడు అధికారులు దాడులు చేయకపోతే కొందరు విషం తాగి మరణించారన్నారు. విద్యుత్తు రంగంతో సహా అనేక విషయాలపై పోరాడి తెలంగాణను సాధించుకున్నామని తెలిపారు. పునర్విభజన హామీల అమలులో తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేసిందన్నారు. విద్యుత్ సంస్కరణ బిల్లులను వెనక్కు తీసుకోకపోతే ఉద్యమం తప్పదని ఆయన హెచ్చరించారు.

ఏపీయే మాకు బకాయీ....
తమకే 17868 కోట్లు విద్యుత్తు బకాయీలు ఏపీ ఉందని కేసీఆర్ అన్నారు. పైగా తామే మూడు వేల కోట్లు చెల్లించాలని ఆదేశించడమేంటని ఆయన ప్రశ్నించారు. కొత్త రాష్ట్రం ఏర్పడిన తర్వాత విద్యుత్తు ఇబ్బందులు లేకుండా చూశామన్నారు. రైతులకు ఉచిత విద్యుత్తును 24 గంటలు అందిస్తున్నామని తెలిపారు. విద్యుత్తు సంస్కరణలు తెచ్చి నాణ్యమైన విద్యుత్ ను అందరికీ అందిస్తున్నామని తెలిపారు. విద్యుత్తు కేటాయింపుల్లో తెలంగాణకు అధికా ప్రాధాన్యం ఇవ్వాలని కోరినా జరగలేదన్నారు. లోయర్ సీలేరు విద్యుత్తు ప్రాజెక్టును తెలంగాణకు అప్పగించారని తెలిపారు.
రాష్ట్రాల హక్కులను...
కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల హక్కుల కాలరాస్తుందని కేసీఆర్ ధ్వజమెత్తారు. అప్రజాస్వామికంగా ఏడు మండలాలపై ఆర్డినెన్స్ తెచ్చి ఏపీకి కేటాయించారని అన్నారు. ఇప్పటి వరకూ కేంద్ర ప్రభుత్వంలో ఉన్న బీజేపీ 11 రాష్ట్రాలను కూలగొట్టిందన్నారు. శ్రీలంకలో అదానీకి కాంట్రాక్టును అప్పగించాలని మోదీ సిఫార్సు చేశారన్నారు. మనకు సింగరేణి బొగ్గు గనులు ఉంటే పది శాతం బొగ్గును విదేశాల నుంచి కొనుగోలు చేయాలని కేంద్రం ఆదేశించిందన్నారు. వాళ్లు ఇచ్చే బొగ్గును మనం కొనాలా? ఇదేనా విద్యుత్తు సంస్కరణ? అంటూ ఆయన ప్రశ్నించారు. ఆస్ట్రేలియాలో తన మిత్రునికి బొగ్గుగనుల కాంట్రాక్టు ఇప్పించాలని చూస్తున్నారన్నారు.
అన్నింటినీ అమ్మేయడానికి....
ఆర్టీసీని కూడా అమ్మడానికి చూసిందన్నారు. అన్ని సంస్థలను అమ్మేయడానికి కేంద్రం చూస్తుందన్నారు. విశ్వగురువు రూపం విశ్వమంతా తెలియాలన్నారు. తెలంగాణలో మూడు తోకలున్నాయని, మమ్మల్ని పడగొడతామని అంటున్నారని కేసీఆర్ ఎద్దేవా చేశారు. బీహెచ్ఈఎల్ కు ఏ కాంట్రాక్టు ఇవ్వవద్దని చెబుతున్నారన్నారు. మోదీ వ్యతిరేకంగా శ్రీలంకలో ప్లకార్డులు చూపించారని కేసీఆర్ గుర్తు చేశారు. జాతీయ స్ఫూర్తి, లక్షణం బీజేపీకి ఉందా? అని కేసీఆర్ ప్రశ్నించారు. విద్యుత్తు అంశం ఉమ్మడి జాబితాలో ఉందన్నారు. కేంద్రాన్ని నిందించే పరిస్థితి రావడం దురదృష్టకరమని కేసీఆర్ అన్నారు. పిట్ట బెదిరింపులకు లొంగే ప్రసక్తి లేదన్నారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉండేది పథ్నాలుగు నెలలు మాత్రమేనని, ఆ తర్వాత దేశమంతా రైతులకు ఉచిత విద్యుత్తును అందిస్తామని తెలిపారు.


Tags:    

Similar News