రెండు రోజులు ఢిల్లీలోనే కేసీఆర్

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఈరోజు, రేపు ఢిల్లీలోనే ఉండనున్నారు. పలు పార్టీల నేతలతో కేసీఆర్ సమావేశం కానున్నారు.

Update: 2022-10-12 03:18 GMT

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఈరోజు, రేపు ఢిల్లీలోనే ఉండనున్నారు. పలు పార్టీల నేతలతో కేసీఆర్ సమావేశం కానున్నారు. జాతీయ పార్టీని ప్రకటించిన తర్వాత తొలి సారి ఢిల్లీకి చేరుకున్న కేసీఆర్ తాజా రాజకీయ పరిణామాలపై నేతలతో చర్చించనున్నారు. బీఆర్ఎస్ పార్టీని ఇంకా ఎన్నికల కమిషన్ గుర్తించలేదు. దీంతో అక్కడే ఉండి న్యాయ నిపుణులతో కూడా కేసీఆర్ సమావేశం కానున్నారు.

జాతీయ రాజకీయాలపై....
దీంతో పాటు దేశ రాజకీయాలపై చర్చించడానికి వివిధ పార్టీల నేతలతో కేసీఆర్ సమావేశం కేసీఆర్ కానున్నారు. అందుబాటులో ఉన్న నేతలతో ఆయన సమావేశమవుతారని గులాబీ పార్టీ నేతలు చెబుతున్నారు. బీజేపీ, కాంగ్రెస్ లకు వ్యతిరేకంగా ఏ ఏ పక్షాలు తమతో కలసి వస్తాయన్న అంచనాకు కేసీఆర్ వస్తారని అంటున్నారు. ఉత్తర భారత దేశం నుంచి కొన్ని ప్రాంతీయ పార్టీలను బీఆర్ఎస్ లో విలీనం చేసేందుకు ప్రయత్నాలు చేస్తారని చెబుతున్నారు.


Tags:    

Similar News