కేసీఆర్ ఏరియల్ సర్వే

తెలంగాణలో అకాల వర్షాలకు నష్టపోయిన పంటలను తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు పరిశీలించనున్నారు

Update: 2023-03-21 04:41 GMT

తెలంగాణలో అకాల వర్షాలకు నష్టపోయిన పంటలను తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు పరిశీలించనున్నారు. ఇప్పటికే పంట నష్టాన్ని అంచనా వేయాలని అధికారులను ఆదేశించారు. పంట నష్టం అంచనాలను సత్వరమే నివేదికల రూపంలో పంపితే వీలయినంత త్వరలో రైతులకు సాయం అందించేందుకు వీలుంటుందని ప్రభుత్వం అభిప్రాయపడుతుంది. ఇందుకోసం పంట నష్టం అంచనాలను త్వరగా వేసి ప్రభుత్వానికి నివేదిక అందించాలని అధికారులను ఆదేశించారు. అయితే ముఖ్యమంత్రి కేసీఆర్ ఈరోజు ఏరియల్ సర్వే నిర్వహించే అవకాశముందని తెలిసింది

పంట నష్టాన్ని...
ఇటీవల కురిసిన అకాల వర్షాలకు, వడగండ్ల వానలకు అనేక పంటలు దెబ్బతిన్నాయి. పంట చేతికి వచ్చే సమయంలో ఈ నష్టం జరగడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వరి, మొక్కజొన్న, మామిడి, పత్తి, మిర్చి, కూరగాయల పంటకు భారీ నష్టం వాటిల్లింది. అనేక జిల్లాల్లో అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతులకు ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని విపక్షాలు కూడా డిమాండ్ చేస్తున్నాయి.


Tags:    

Similar News