రేపు జనగామకు కేసీఆర్... ప్రసంగంపైనే ఆసక్తి

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రేపు జనగామ జిల్లాలో పర్యటించనున్నారు.

Update: 2022-02-10 12:31 GMT

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రేపు జనగామ జిల్లాలో పర్యటించనున్నారు. రేపటి నుంచి రెండు రోజుల పాటు జనగామ, యాదాద్రి జిల్లాల్లో పర్యటించనున్నారు. రేపు జనగామలో కేసీఆర్ పర్యటిస్తారు. జనగామలో జరిగే బహిరంగ సభలో కేసీఆర్ ప్రసంగించనున్నారు. రాజ్యాంగంపై వ్యాఖ్యలు చేసిన అనంతరం తొలిసారి కేసీఆర్ బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. దీంతో ఆయన ఏం మాట్లాడతారన్నది ఉత్కంఠగా మారింది.

కొత్త రాజ్యాంగం....
కొత్త రాజ్యాంగం కావాలని కేసీఆర్ అన్న తర్వాత చాలా రాజకీయ పరిణామలు చోటు చేసుకున్నాయి. ప్రధాని మోదీ హైదరాబాద్ కు వస్తే కనీసం మర్యాదపూర్వకంగానైనా కలవలేదు. ఆ తర్వాత ప్రధాని రాష్ట్ర విభజనపై చేసిన వ్యాఖ్యలతో రాజకీయ వాతావరణం మరింత వేడెక్కింది. దీంతో పార్లమెంటు ఉభయ సభల్లో టీఆర్ఎస్ ప్రధానిపై ప్రివిలేజ్ మోషన్ ఇచ్చింది.
మోదీపై మరోసారి....
ీదీంతో రేపు జనగామ బహిరంగ సభలో కేసీఆర్ ఏం మాట్లాడతారన్న దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. 11వ తేదీన జనగామ జిల్లాలోనూ, 12 వతేదీన యాదాద్రి జిల్లాలోనూ కేసీఆర్ పర్యటిస్తారు. జనగామ జిల్లాలో రేపు నూతనంగా నిర్మించిన కలెక్టటేర్ భవనాలను సీఎం ప్రారంభిస్తారు. అలాగే టీఆర్ఎస్ జిల్లా కార్యాలయాన్ని కూడా ఆయన ప్రారంభిస్తారు. మరుసటి రోజు భువనగిరిలో కలెక్టరేట్ భవనాలను ప్రారంభించి అనంతరం యాదాద్రిలో వీవీఐపీ గెస్ట్ హౌస్ లను ప్రారంభిస్తారు. జనగామలో ఇప్పటికే బీజేపీ, టీఆర్ఎస్ మధ్య ఘర్షణ జరిగింది. దీంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు.


Tags:    

Similar News