25 ఏళ్ల తర్వాత కొండగట్టుకు కేసీఆర్
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు కొండగట్టు ఆంజనేయస్వామి పుణ్యక్షేత్రాన్ని దర్శించుకోనున్నారు
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు కొండగట్టు ఆంజనేయస్వామి పుణ్యక్షేత్రాన్ని దర్శించుకోనున్నారు. ఈరోజు ఉదయం 9 గంటలకు హైదరాబాద్ నుంచి బయలుదేరి హెలికాప్టర్ లో కొండగట్టుకు చేరుకుంటారు. 9.40 గంటలకు కొడిమ్యాిల మండలంలోని జేఎన్‌టీయూ కళాశాలలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ వద్ద దిగుతారు.
ఆలయ అభివృద్ధి పనులపై...
అక్కడి నుంచి రోడ్డుమార్గాన బయలుదేరి కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయానికి చేరుకుంటారు. ప్రత్యేక పూజలు చేసిన అనంతరం ఆలయ అభివృద్ధి పనులపై ముఖ్మమంత్రి కేసీఆర్ అధికారులతో సమీక్షిస్తారు. కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి వంద కోట్ల రూపాయలు కేటాయించారు. దాదాపు ఇరవై ఐదేళ్ల తర్వాత కేసీఆర్ ముఖ్యమంత్రి హోదాలో కొండగట్టు ఆంజనేయ స్వామికి వస్తుండటంతో ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.