Telangana : హైదరాబాదీలకు రేవంత్ తొలి ఏడాది చెప్పిన గుడ్ న్యూస్ ఇదే
కొత్త సంవ్సరం తొలి రోజు హైదరాబాద్ వాసులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్ చెప్పారు.
కొత్త సంవ్సరం తొలి రోజు హైదరాబాద్ వాసులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్ చెప్పారు. మెట్రో రైలును మేడ్చల్ వరకూ పొడిగించాలని నిర్ణయించారు.ప్యారడైజ్ నుంచి మేడ్చల్ వరకూ కారిడార్ ను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ మేరకు డీటెయిల్డ్ ప్రాజెక్టు రిపోర్టును తయారు చేయాలని ఆదేశించారు.
మేడ్చల్ కు మెట్రో రైలు...
డీపీఆర్ ను వెంటనే కేంద్ర ప్రభుత్వానికి పంపి ఆమోదం పొందేందుకు ప్రయత్నిస్తామని రేవంత్ రెడ్డి చెబుతున్నారు. ప్యారడైజ్ నుంచి మేడ్చల్ వరకూ, షామీర్ పేట్ నుంచి జేబీఎస్ వరకూ వెంటనే రెండు కారిడార్లకు సంబంధించిన డీపీఆర్ లను సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించడంతో నార్త్ హైదరాబాద్ లో ఉంటున్న వారికి నిజంగా ఇది అమలయ్యేతే కొత్త సంవత్సరం వేళ శుభవార్తే అవుతుంది.
ఇప్పుడు Desh Telugu Keyboard యాప్ సహాయంతో మీ ప్రియమైన వారికి తెలుగులో సులభంగా మెసేజ్ చెయ్యండి. Desh Telugu Keyboard and Download The App Now