Breaking : టాలీవుడ్ కు షాకిచ్చిన రేవంత్ రెడ్డి.. అవి ఇస్తేనే అనుమతులు
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలుగు చిత్ర పరిశ్రమకు మంచి సూచనలు ఇచ్చారు. అలాగే షాక్ కూడా ఇచ్చారు
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలుగు చిత్ర పరిశ్రమకు మంచి సూచనలు ఇచ్చారు. అలాగే షాక్ కూడా ఇచ్చారు. సామాజిక బాధ్యత ఉండేలా సినీ పరిశ్రమ వ్యవహరించాలని ఆయన కోరారు. డ్రగ్స్, మాదక ద్రవ్యాలపై రెండు నుంచి మూడు నిమిషాల నిడివి గల వీడియో సందేశాన్ని సినిమా యూనిట్ అందిస్తేనే వారికి వెసులు బాటు ఇవ్వాలని పోలీసు ఉన్నతాధికారులను ఆదేశించారు. కేవలం టిక్కెట్లు రేట్లు పెంచుకోవడమే ముఖ్యం కాదని, సామాజిక బాధ్యత కూడా అంతే ముఖ్యమని టాలీవుడ్ పరిశ్రమ గుర్తించాలని ఆయన కోరారు.
థియేటర్లలోనూ...
సినిమా టిక్కెట్లు పెంచాలని, వెసులుబాటు కల్పించాలని కోరి వచ్చే వారి నుంచి డ్రగ్స్, మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా మూడు నిమిషాల వీడియోను అందించాలని ఆయన కోరారు. తెలంగాణ నుంచి డ్రగ్స్ ను తరమి కొట్టాలంటే అందరి సహకారం తీసుకోవాలని ఆయన కోారరు. డ్రగ్స్ కట్టడికి సినిమా పరిశ్రమ కూడా ముందుకు రావాలన్నారు. థియేటర్లలోనూ డ్రగ్స్ కు వ్యతిరేకంగా ప్రభుత్వ యాడ్స్ తో పాటు కొన్ని ప్రకటనలను ఉచితంగా ప్రదర్శించాలని రేవంత్ రెడ్డిపోలీసు అధికారులను ఆదేశించారు.